Home Headlines Thatikonda Rajaiah,కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య..! – kcr is likely to announce thatikonda rajaiah as warangal brs mp candidate to compete with kadiyam srihari

Thatikonda Rajaiah,కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య..! – kcr is likely to announce thatikonda rajaiah as warangal brs mp candidate to compete with kadiyam srihari

0
Thatikonda Rajaiah,కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య..! – kcr is likely to announce thatikonda rajaiah as warangal brs mp candidate to compete with kadiyam srihari

[ad_1]

Kadiyam Srihari: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీలోనే కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకుని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టచ్‌లోకి వెళ్లి.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రచారం. బయటికి ఏమాత్రం పొక్కకుండా.. సైలెంట్‌గా మంతనాలు కానిస్తూ నేతలు పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు.. పార్టీలో అగ్రనేతగా ఉన్న కేకేతో పాటు కడియం శ్రీహరి కూడా తమ కూతుళ్లతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేయగా.. ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే.. ఈరోజు ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. దీంతో.. ఆయన పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. కడియమే కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా నిలబడతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

అయితే.. సొంత పార్టీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేసి.. నాయకత్వాన్ని పట్టుబట్టి మరీ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కడియం.. తీరా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, తన కుమార్తెకు కూడా ఎంపీ టికెట్ రాబట్టుకుని ఇప్పుడు ఇలా చేయటంపై గులాబీ బాస్ కేసీఆర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కడియం కోసం ఇంత చేస్తే చివరకు ఇలా నమ్మక ద్రోహం చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనకు చెక్ పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. కడియం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టిన తాటికొండ రాజయ్యనే.. ఆయనపై ఎంపీగా నిలబెట్టి గెలిపించి సత్తా చాటాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం రాజయ్యను కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పిలిపించుకున్నట్టు సమాచారం.

అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ నాయకత్వం ఆదేశించిందన్న ఒకే ఒక్క కారణంతో.. తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కడియం విజయానికి తాటికొండ రాజయ్య పని చేశారు. కాగా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని, అధికారంలోకి వచ్చాక ఎంపీగా కానీ, ఇంకా వేరే మంచి పదవి ఇస్తామని రాజయ్యకు కేసీఆర్ హామీ ఇవ్వగా.. రాజయ్య తన వంతు కృషి చేశారు. కాగా.. అసెంబ్లీ ఫలితాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఆయన ఆశలన్ని ఆవిరైపోయారు.

దీంతో.. ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అయితే.. కాంగ్రెస్‌లోకి వెళ్తారని అంతా అనుకున్నా.. ఆయన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా న్యూట్రల్‌గా ఉన్నారు. కాగా.. ఇప్పుడు సరైన సమయం రావటంతో.. కడియంపై రివేంజ్ తీర్చుకునేందుకు బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజీనామాను ఉపసంహరించుకుని మరోసారి బీఆర్ఎస్ కండువా కప్పుకుని.. కడియం నిలబడితే కడియంపైనా, లేకుండా ఆయన కుమార్తె మీద రాజయ్య పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

[ad_2]

Telugu Samayam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here